హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా మానవహారం

KMM: పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ‘నషా ముక్తి-ఆరోగ్య అవగాహన’ సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రిన్సిపాల్ రామకృష్ణ సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రేమలత, నారాయణరావు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.