హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ, దసరాకు ఏర్పాట్లు

WGL: గ్రేటర్ వరంగల్లో బతుకమ్మ, దసరా పండుగలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. 66 డివిజన్లలో వేడుకల ప్రాంతాలను గుర్తించి రోడ్ల మరమ్మతులు, పారిశుధ్యం, లైటింగ్, మంచినీరు, డస్టింగ్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉర్సుగుట్ట, సిద్ధేశ్వర ఆలయం, రంగసాయిపేటలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.