హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.12 లక్షలు ఇవ్వాలని అడిగిన వ్యక్తిపై దాడి

JGL: తనకు రావాల్సిన రూ.12 లక్షలు ఇవ్వాలని అడిగిన వ్యక్తిపై నలుగురు దాడి చేసిన ఘటన కోరుట్ల మండలం సర్పరాజ్‌పూర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన కొక్కు రాజుకు సౌదీలో పనిచేసిన సమయంలో సిమల్ల మధు వద్ద రూ.12 లక్షలు రావాల్సి ఉంది. డబ్బులు అడుగుతూ రాజు బైక్‌పై వెళ్తుండగా మధు కుమారుడు గణేష్‌తో పాటు దిలీప్, రఘురాం, హరీష్ అడ్డుకుని దాడి చేశారు.