హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొర్రెల కాపర్లు, ఫారెస్ట్ బీట్ అధికారి మధ్య ఘర్షణ

SRCL: ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో గొర్రెల కాపర్లు, ఫారెస్ట్ బీట్ అధికారి వేణు మధ్య సోమవారం ఘర్షణ కలకలం రేపింది. రోడ్డుపై గొర్రెలు మేపుతున్నారని అధికారి ప్రశ్నించడంతో వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, గొర్రెల కాపర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.