హైదరాబాద్: 28°C
తెలంగాణ

భగత్ సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణంలోని మోచి బజారులో భగత్ సింగ్ 119వ జయంతి నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ విగ్రహానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. స్వతంత్రం కోసం భగత్ సింగ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ ఛైర్మన్ జ్యోతి లక్ష్మణ్, అరవింద్, భాను తేజ, శేఖర్, పవన్, మహిపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.