హైదరాబాద్: 28°C
తెలంగాణ

​బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి: CP

SDPT: మర్కూక్ పోలీస్ స్టేషన్‌ను సిద్దిపేట CP రష్మి పెరుమాళ్‌ వార్షిక తనిఖీ చేశారు. పరేడ్ గౌరవ వందనం స్వీకరించి రికార్డులు, కేసు వాహనాలు, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదులపై త్వరితగతిన స్పందిస్తూ కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచాలని సీపీ ఆదేశించారు.