హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి కోసం పూలతో గరుడ వాహనం

E.G: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కడియపులంక పూల మార్కెట్లో గణనాథుడికి స్వదేశీ, విదేశీ పుష్పాలతో రూపొందించిన గరుడ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్షల విలువైన పుష్పాలతో సుమారు 20 మంది కళాకారులు మూడు రాత్రులు, రెండు పగళ్లు శ్రమించి దీనిని తీర్చిదిద్దారు. ఆర్కిడ్స్, జెర్బెరాస్, గులాబీలు, చామంతులు, లిల్లీలు, మల్లెపూలతో అలంకరించారు.