మంచిర్యాల జిల్లాలోని వివిధ కేసుల దర్యాప్తు, విచారణ, పెండింగ్ కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులతో సీపీ అంబర్ కిషోర్ ఝా సోమవారం సమావేశం నిర్వహించారు. కేసుల విచారణలో నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. నిందితులకు శిక్షలు పడేలా అందరు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
తెలంగాణ
'నిందితులకు శిక్షలు పడేలా సమన్వయంతో పనిచేయాలి'


