హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకర మలుపు వద్ద భద్రతా చర్యలు..

TPT: వేలవేడు ముచ్చివోలు రహదారిలోని ప్రమాదకర మలుపును ఆర్అండ్బి డీఈ రాంబాబు, అధికారులు పరిశీలించారు. జనసేన నాయకుడు దండి నరేంద్ర సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ చర్యల్లో భాగంగా మలుపుకు ఇరువైపులా థిక్ స్టడ్స్, క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.