VSP: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మంచినీరు, రహదారులు, పారిశుధ్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలపై ఉద్యమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో కేకే రాజు, కురసాల కన్నబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలపై వైసీపీ పోరు


