NLG: నల్గొండ మేఖల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో సోమవారం జరిగిన SGF U-17 యునైటెడ్ జిల్లా తైక్వాండో ఎంపికల్లో మునుగోడు మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల విద్యార్థినులు సత్తా చాటారు. తైక్వాండోలో 6 స్వర్ణాలు సాధించి రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించారు. త్వరలోనే వికారాబాద్‌లో ఎంపికలు జరగనున్నాయి. SGF సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి ఎంపికకు మునుగోడు గురుకుల విద్యార్థినులు


