హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారి

BPT: పంగులూరు మండలంలోని ముప్పవరం గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, ఎ. సూర్యకుమారి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో లబ్ధిదారులకు అందుతున్న సేవలు, రికార్డులను ఆమె నిశితంగా పరిశీలించారు. చిన్నారులకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలను అంగన్‌వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.