హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై దృష్టి: విజయశ్రీ

TPT: సూళ్లూరుపేట స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం, శాంతిభద్రతలు, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, భూ సమస్యలపై శాఖల వారీగా సమీక్షించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అభివృద్ధి పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు.