ATP: యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీకి చెందిన వికలాంగుడు సుంకన్నకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం బ్యాటరీ సైకిల్‌ను అందజేశారు. సుంకన్న పడుతున్న ఇబ్బందిని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించి ఈ సైకిల్‌ను సమకూర్చారు. తన కష్టాన్ని గుర్తించి సాయం అందించిన ఎమ్మెల్యేకు సుంకన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వికలాంగుడికి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సాయం


