హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రంథాలయ దుస్థితిపై యువకుల ఆగ్రహం

SRD:​ సిర్గాపూర్ మండల కేంద్రంలోని లైబ్రరీ భవనం శిథిలావస్థకు చేరడంపై స్థానిక యువకులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం అటుగా వెళుతున్న సర్పంచ్ శ్రీనివాసరావును యువకులు అడ్డుకుని భవన దుస్థితిని వివరించారు. గ్రంథాలయ పునరుద్ధరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు, పాఠకులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.