ATP: తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదివిన అభ్యర్థులు అర్హులు. అర్హత ఉన్న యువతీ, యువకులు నమోదు చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో సెప్టెంబర్ 30న జాబ్ మేళా


