హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

NRML: మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వివిధ శాఖల పనులపై సమీక్షించారు. పెండింగ్‌ పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.