హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సులేక విద్యార్థులకు ఇబ్బందులు

ప్రకాశం: కనిగిరి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆర్టీసీ బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమాలు ఉన్న సమయంలో మోడల్ స్కూల్‌కు బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు పాఠశాల వద్దే నిలిచిపోతున్నారు. తల్లిదండ్రుల కమిటీ పలుమార్లు ఆర్టీసీ డీఎం, సిబ్బందికి విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని చెబుతున్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.