అల్లూరి జిల్లాలోని అన్ని కళాశాలలు, విద్యాసంస్థల్లో మంగళవారం (రేపు) SVEEP ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత, తొలిసారి ఓటర్లుగా నమోదయ్యే విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తారు. సంబంధిత అధికారులు, అర్హులైన విద్యార్థులతో అక్కడికక్కడే ఫారం-6 భర్తీ చేయించి, కొత్త ఓటర్లుగా నమోదు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలోని అన్ని కళాశాలల్లో SVEEP ఓటర్ అవగాహన


