హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేనమామ, మేనల్లుడి మధ్య ఘర్షణ.. గొడ్డలితో దాడి

PLD: కారంపూడి(మం) చిన్నకొదమగుండ్లలో స్థల వివాదంతో మేనమామ, మేనల్లుడి మధ్య ఘర్షణ జరిగింది. మద్యం సేవించి మేనమామ ఇంటికి వెళ్లిన పళ్ళపాటి చిన్న వెంకటేశ్వర్లు కంపసటి కొండపై గొడ్డలితో దాడి చేశాడు. కొండ కుడి భుజానికి తీవ్ర గాయాలు కాగా, గురజాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించి, ఏడు కుట్లు వేశారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.