హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని దివ్యాంగుడి ఆవేదన'

ADB: ఇందిరమ్మ ఇల్లును కేటాయించాలని అధికారులకు విన్నవించిన తగిన స్పందన లేదని దివ్యాంగుడు చుక్కబోట్ల పోచన్న తన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందించి తనకు న్యాయం చేయాలని విన్నవించారు.