హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారాంపురంలో రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు

ELR: ఉంగుటూరు మండలం సీతారాంపురం సెంటర్‌లో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు హాస్పిటల్‌లో బంధువులను పరామర్శించి గణపవరం వెళ్తున్న దంపతులు బైక్‌పై వస్తుండగా ఒక్కసారిగా కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో గణపవరానికి చెందిన పూల గంగాధర్ రావు ఆయన భార్య పూల సునీత లకు గాయాలయ్యాయి.