హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్పీ ఆధ్వర్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

బాపట్ల జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ ఆదేశాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ సీహెచ్.చంద్రమౌళి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చట్ట పరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ, భూ వివాదాలకు సంబంధించి మొత్తం 43 ఫిర్యాదులు వచ్చాయి.