WNP: జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు సిబ్బందికి పదోన్నతులు లభించాయి. ఏఎస్ఐ వెంకట నాగరాజు ఎస్సైగా, హెడ్ కానిస్టేబుళ్లు రాజేందర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి పదోన్నతి పొందిన వారికి అభినందనలు తెలిపారు. పదోన్నతులు పొందిన వారు మరింత బాధ్యతతో ప్రజలకు సేవలందించాలని సూచించారు.
తెలంగాణ
పోలీస్ శాఖలో ముగ్గురికి పదోన్నతులు


