MBNR: పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని PDSU, SFI, AISF విద్యార్థి సంఘాలు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టా రెడ్డికి వినతిపత్రం ఇచ్చాయి. పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా అమ్మాయిలకు వసతి కల్పించాలని కోరారు. భవన నిర్మాణాలు వేగవంతం చేస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్


