హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతుంది: ఎమ్మెల్యే

BDK: పౌర హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆరోపించారు. సోమవారం పాల్వంచలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు.