NLG: రాబోయే కాలంలో రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం తథ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మిర్యాలగూడలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. దీనిపై రాహుల్ గాంధీ నిర్భయంగా పోరాటం సాగిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తెలంగాణ
కేంద్రంలో రాబోయేది రాహుల్ గాంధీ ప్రభుత్వమే: ఉత్తమ్


