హైదరాబాద్: 28°C
తెలంగాణ

'న్యాయ సేవలు సకాలంలో అందేలా కృషి చేయాలి'

GDWL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యాలయంలో సోమవారం పారా లీగల్ వాలంటీర్ల (PLVs)తో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.నిష్కా పత్రుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారా లీగల్ వాలంటీర్ల్ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ న్యాయ సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు న్యాయ సేవలు సకాలంలో అందేలా కృషి చేయాలన్నారు.