NLG : మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. గత జూలై 30న ప్రమాదానికి గురైన అంబులెన్స్‌కు నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ మరమ్మతులు చేయించలేదు. అత్యవసర సమయాల్లో రోగులను హైదరాబాద్‌కు తరలించాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి అంబులెన్స్‌ను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
తెలంగాణ
అంబులెన్స్ సౌకర్యం లేక రోగుల ఇబ్బందులు


