హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌటుప్పల్‌లో నత్తనడకన అండర్‌పాస్ పనులు

BHNG: చౌటుప్పల్‌లోని  65వ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్ నుంచి తంగడపల్లి రోడ్డు వరకు అండర్‌పాస్, వంతెన పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల మధ్య రోడ్డు దాటేందుకు ప్రజలు భయపడుతున్నారు. దసరా రద్దీ దృష్ట్యా పనులు వేగవంతం చేసి, తాత్కాలిక మార్గాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.