NLG: నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 30న దేవరకొండలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నట్లు కరస్పాండెంట్ కందాల పాపిరెడ్డి, ప్రిన్సిపాల్ కందాల స్వప్న శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నిమ్మల శంకర్ గౌడ్, పూజిత క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఏవీఎం విద్యార్థులు


