ప్రకాశం: కనిగిరి మండలం ఎడవల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదరకట్ట నుంచి కనిగిరి వైపు వస్తున్న టాటా వ్యాను, కనిగిరి నుంచి పొదిలి వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


