NLR: అల్లూరు మండలంలోని పాడి రైతులు, పశు యజమానులకు అల్లూరు పశువైద్యాధికారి డా. మహేశ్వర్‌రెడ్డి సోమవారం పలు సూచనలు చేశారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పశు బీమా పథకాన్ని పునఃప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా గొర్రెలు, పశువులకు బీమా ప్రీమియంలో 85 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన 15 శాతం మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పశు యజమానులకు పలు సూచనలు


