హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో ఈఅభ్యాస్ ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష.

TPT: రాపూరులోని జెమ్స్ పాఠశాలలో సోమవారం ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఐఐటీ ఒలింపియాడ్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలు విద్యార్థులకు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షలకు సంసిద్ధం కావడానికి ఉపయోగపడతాయని పాఠశాల యాజమాన్యం తెలిపింది. తిరుపతి, గూడూరు ప్రాంతాల విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు.