హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటి కోసం ఆత్మహత్య యత్నం

JN: ఇందిరమ్మ ఇల్లు రాలేదన్న ఆవేదనతో ఎల్లంల చెందిన బిర్రు రాజు అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకోని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. తన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉందంటూ తప్పుడు ప్రచారం చేసి ఇల్లు మంజూరు కాకుండా చేస్తున్నారని రాజు ఆరోపించారు. తన కుమారుడు ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని బాధితుడు తెలిపారు.