హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరంగనాథ ఆలయంలో విగ్రహాల చోరీపై దేవాదాయ శాఖ పరిశీలన

WNP: శ్రీరంగనాథ స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ ఘటనపై బీజేపీ రాష్ట్ర ఎండోమెంట్ జాయింట్ కన్వీనర్ స్వాతి రెడ్డి, దేవాదాయ శాఖ బృందం ఆలయాన్ని సందర్శించి పరిశీలించారు. అర్చకులు, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విగ్రహాల చోరీకి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, పంచలోహ విగ్రహాలను సురక్షితంగా ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.