హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనుల భూములకు హక్కు పాత్రలు ఇవ్వాలి

KMR: ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. 70 కుటుంబాలు గత 60 ఏళ్లుగా సర్వే నంబర్ 66లో 40 ఎకరాలు, 176లో 13 ఎకరాలు, 177లో 40 ఎకరాలు, అదనంగా 40 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నాయని తెలిపారు. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న ఈ భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.