హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి: ఎస్పీ

SRPT: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.