SDPT: డీజేలో వచ్చే భారీ శబ్దాలతో ఆపరేటర్ మృతిచెందిన ఘటన గజ్వేల్ మండలం సింగాటంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొల్గూర్‌కు చెందిన బండారి దినేష్ (20) డీజే నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉన్న ఒక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
భారీ శబ్దాలకు డీజే ఆపరేటర్ మృతి


