MBNR: మహబూబ్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ శ్రీమతి డి. జానకి వార్షిక తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది విధులను, కేసుల పురోగతిని ఆమె సమీక్షించారు. రిసెప్షన్‌లో ఫిర్యాదుల నమోదు, ఆన్‌లైన్ ఎంట్రీలను పరిశీలించారు. స్టేషన్ డైరీ, ఎఫ్‌ఐఆర్‌లు, మరియు ముఖ్యంగా మహిళలు, బాలికలకు సంబంధించిన పెండింగ్ కేసుల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తెలంగాణ
మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు


