హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిర్మల్ పట్టణాన్ని క్లీన్ సిటీగా ఉంచాలి'

NRML: పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నిర్మల్ పట్టణాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రవీందర్ అన్నారు. సోమవారం స్థానిక ఫిష్ మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్యం లోపించడంతో మార్కెట్ ఏరియాను నిత్యం శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.