హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

పల్నాడు జిల్లాలో సెప్టెంబర్ 29న 1,556 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో 1,205 ప్రాథమిక, 54 ప్రాథమికోన్నత, 297 ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.