హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త కళాశాల భవనాల కోసం దీక్ష

NRPT: నారాయణపేటలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ వద్ద దీక్షలు చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్ మొదటి రోజు దీక్షలను ప్రారంభించారు. జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.