సత్యసాయి: ముదిగుబ్బ మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని సీపీఐ నాయకులు చల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కార్మికులతో కలిసి సోమవారం సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'RWS కార్మికుల జీతాలు చెల్లించాలి'


