SRPT: మఠంపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న స్థలంలోనే నూతన ఎమ్మార్వో కార్యాలయ భవనం నిర్మించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యాలయాన్ని గ్రామ చివరన ఏర్పాటు చేస్తే వృద్ధులు, వికలాంగులు, ఇబ్బందులు పడతారని తెలిపారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రస్తుత స్థలంలోనే భవన నిర్మాణాన్ని చేపట్టాలని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ
ప్రస్తుత స్థలంలోనే ఎమ్మార్వో భవనం నిర్మించాలి


