హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి: NPRD

ADB: జిల్లాలో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా తక్షణమే భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డి) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ శాఖల్లో జీవో 19ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.