RR: మంత్రాలనెపంతో వృద్ధురాలిని దారుణంగా కొట్టిన ఘటన మంచాల మండలం నోములలో జరిగింది. గ్రామస్తులు ఆమెను అమానుషంగా చెట్టుకు కట్టేసి, ఉరికించి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గర్భిణుల దుస్తులు మాయమవుతున్నాయంటూ ఆమెపై అనుమానంతోనే కొట్టినట్లు సమాచారం. అధికారులు స్పందించి నిజానిజాలు తేల్చాలని అక్కడివారు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
VIDEO: మంత్రాలనెపంతో చెట్టుకు కట్టేసి కొట్టారు..!


