హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మారథాన్ విజేతలకు నగదు బహుమతులు

కర్నూలులో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన బషీర్, వెంకట భరత్, వెంకటేశ్వరి, రామలక్ష్మికి నగదు బహుమతులకు సంబంధించిన చెక్కులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజేతలను అభినందించారు.