హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాయికల్ టోల్‌గేట్ వద్ద దొరికింది జింక మాంసమే'

RR: షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌గేట్ వద్ద ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నది జింక మాంసమేనని సీసీఎంబీ(CCMB) పరీక్షల్లో తేలింది. కొత్తూరు పశువైద్య అధికారిణి పద్మిని శాంపిల్స్ సేకరించి పరీక్షించగా ఈ విషయం స్పష్టమైంది. దీనికి సంబంధించిన నివేదికను విచారణ అధికారులకు అందజేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.