హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాక్‌ ఎలక్షన్‌పై విద్యార్థులకు అవగాహన

VKB: బంట్వారం మోడల్‌ స్కూల్‌లో సోమవారం మాక్‌ ఎలక్షన్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ఓటింగ్‌ విధానంపై విద్యార్థులకు ప్రిన్సిపల్ బ్యూలా అవగాహన కల్పించారు. మాక్‌ పోలింగ్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించే విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో బాధ్యతాయుతంగా ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.